20-07-2025 01:15:58 AM
మహారాష్ట్ర వైపు ఓవర్గం..
తెలంగాణలోనే ఉంటామని మరో వర్గం
ఆసిఫాబాద్ జిల్లాలో సరిహద్దు అలజడి
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 19 (విజయక్రాంతి): మహారాష్ట్ర, తెలంగాణ సరిహ ద్దు ప్రాంతంలోని 14 గ్రామాలకు చెందిన ప్రజల్లో మరోసారి కలవరం మొదలైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు పలు సందర్భాల్లో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు గ్రామాలను తమ రా ష్ట్రంలో కలుపుతామని ప్రకటనలు చేయడం తో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది.
రెండు రాష్ట్రాలలోని ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొం దుతున్న ప్రజలు ఏదో ఒక రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రకు చెంది న ప్రజాప్రతినిధులు మరో ముందడుగు వే సి సమీప గ్రామాల ప్రజా ప్రతినిధులతో ప్ర త్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి సరిహద్దు గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ విషయంపై గ్రామాలలో ప్రజలకు తెలియజేయాలని సూచించినట్లు సమాచారం.
మొదలైన అసలు కథ
మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇందులో ఎస్టీ సా మాజిక వర్గానికి చెందిన వారు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించాలని ఇటీవల జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇతర వర్గాలకు ప్రజలు మాత్రం మహారాష్ట్ర వైపు మొగ్గు చూస్తున్నట్లు తెలుస్తోంది.
గిరిజనేతరులకు చెందిన పోడు భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోవడంతోనే ఆ వర్గాల ప్రజలు మహారాష్ట్రలో కలిసేందు కు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మ హారాష్ట్రకు చెందిన ప్రజాప్రతినిధులు పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనేతరులకు పట్టా లు ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచా రం. ఇప్పటికే ఆ ప్రాంతంలోని ప్రజలతో మ హారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే, మంత్రుల సహకారంతో ముంబైలో ప్రత్యేక సమావేశం అయినట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రభుత్వాలు స్పందించాల్సిందే
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల విలీ నం విషయంలో ఇరు ప్ర భుత్వాలు స్పందించి సమన్వయంతో ముందుకు వె ళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలలో ఉన్న భిన్నాభిప్రాయాలను తొలగించేందుకు గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించాలి. ఇరు రాష్ట్రాల అధికారులతో జాయిం ట్ సర్వే నిర్వహించి అన్నివర్గాల ప్రజల అభిప్రాయ సేకరణ చేపట్టి మెజార్టీ ప్రజల అభిప్రాయాల మేరకు గ్రామాలను వారు కోరుకున్న చోట కలిపే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రెండు రాష్ట్రాల్లో ప్రాతినిథ్యం
మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని కెరమెరి మండలం అంతాపూర్, పరాన్ వాడ, పరంధోలి, బోలా పటార్, నారాయణగూడ, పద్మావతి, మహారాజగూడ, ఇందిరానగర్, గౌరీ, ముఖద్దం కూడా, లేండి జాల 14 గ్రా మాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇరు రాష్ట్రాలలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల ఎన్నికలలో ఓటింగ్‌లో పాల్గొనడంతో పాటు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతా రు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలోను రెండు ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందుతారు. సరిహద్దు గ్రామాలలో కార్యాలయాలు, పాఠశాలలు, అధికారిక కార్యక్రమాలు రెండు రాష్ట్రాలకు చెందినవి కొనసాగుతున్నాయి.
హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
సరిహద్దు గ్రామాలలో నెలకొన్న సమస్యల నేపథ్యంలో హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యం లో ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు జిల్లా చైర్మన్ రమేశ్ తెలిపారు.ఇప్పటికే నారాయణగూడ, ఏసాపూర్, అంతాపూర్, ఇంద్రనగర్, పద్మావతి గ్రామాలలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు తెలిసింది. ఇప్పటివరకు నిర్వహించిన సంతకాల సేకరణలో అత్యధికంగా గిరిజనులు తెలంగాణ వైపు మొగ్గు చూపారు.
సమస్యకు పరిష్కారం చూపాలి
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు గ్రామా ల సమస్యను ప్రభుత్వాలు సమన్వయంతో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలవడంతో నేటికీ ఆ ప్రాంత గ్రామాల ప్రజలు తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. ఇంతే కాకుండా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో తెలంగాణ సరిహ ద్దు ప్రాంతవాసులు తమను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని ధర్నాలు నిర్వహించిన సంఘటనలు ఉన్నా యి.
ఇప్పుడు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని సరిహద్దు గ్రామాల విలీనం విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సమస్యను పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
తెలంగాణలోనే ఉంటాం
భూమిని నమ్ముకొని జీవిస్తున్న తమ ను తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలని కో రుకుంటున్నాం.ఈ రాష్ట్రం ఇప్పటికే గిరిజనులకు పట్టాలు ఇచ్చి హక్కున చేర్చుకుం ది. అలాంటి రాష్ట్రాన్ని వదిలి మహారాష్ట్రకు వెళ్లే ప్రసక్తే లేదు. మహారాష్ట్రలో విలీనం చేసే యోచనను విరమించుకోవాలని ఆ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం నుంచి విడదీస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం.
విజేష్, పరంధోలితాండ
ప్రభుత్వాలు స్పందించాలి
మహారాష్ట్ర ప్రభుత్వం కెరమెరి మండలంలోని 14 సరిహద్దు గ్రామాలను విలీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవడంతో ఈ ప్రాంతంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని 14 గ్రామాలలో ఇరు రాష్ట్రాల అధికార యంత్రాంగం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.
రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్న ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టాల్సిన అవసరముంది.రెండు రాష్ట్రాల మధ్య సమస్య ఇప్పుడు ప్రజల మధ్య చిచ్చుపెట్టి రెండు వర్గాలుగా విడిపోయే పరిస్థితి వచ్చింది.తెలంగాణ రాష్ట్రంలోని 14 గ్రామాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఉంది.
రాథోడ్ రమేష్, జాతీయ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్,ఆసిఫాబాద్