calender_icon.png 21 July, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేసేదెప్పుడు..

21-07-2025 12:46:58 AM

  1. పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు 

ఇబ్బందులు పడుతున్న  రైతులు 

కామారెడ్డి, జూలై 20 (విజయ క్రాంతి), ఒకవైపు జిల్లా విద్యుత్ శాఖ అధికారి శ్రావణ్ కుమార్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే తమ విద్యుత్ శాఖ సిబ్బంది వచ్చి ట్రాన్స్ఫార్మర్ను మార్చి మరో ట్రాన్స్ఫార్మర్ ఇస్తామని ఒకవైపు ప్రకటనలు చేస్తుంటే, మరోవైపు స్థానికంగా ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామాల్లోని ఎస్ ఎస్ 39 ట్రాన్స్ఫార్మర్ రైతుల కోసం ఏర్పాటు చేశారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వారం రోజులు గడిచిన విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. వరి నాటుకునేందుకు సిద్ధమవుతున్న రైతులకు ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో నాట్లు వేయలేకపోతున్నామని రైతులు తెలిపారు.

ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరిన స్థానిక విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారి మాత్రం వెంటనే స్పందిస్తున్నామని పత్రిక ముఖంగా ప్రకటిస్తున్న ఆచరణలో మాత్రం స్థానిక అధికారులు పాటించడం లేదని అనడానికి తిప్పాపూర్ లోని ఎస్ ఎస్ 39 ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిదర్శనం ఇదేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తులు చేపట్టి కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు స్పందిస్తారా లేదా వేచి చూడాల్సిందే.