calender_icon.png 21 July, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గపోరు ఎటు దారితీసేనో

21-07-2025 12:00:00 AM

ఈటల కొత్త పార్టీపై సోషల్ మీడియాలో ప్రచారం

కరీంనగర్, జూలై 20 (విజయ క్రాంతి): కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జ నతా పార్టీలో వర్గపోరు మరోమారు బహిర్గతమయింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇటీవల హుజూరాబాద్ లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కా ర్యక్రమానికి ఈటల వర్గీయులను ఆహ్వానించకపోవడంతో హుజూరాబాద్ మాజీ ఎమ్మె ల్యే, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కు కోపం తెప్పించింది.

ఈటల రాజేందర్ ను కలవడానికి హుజూరాబాద్ నియోజకవర్గానికి  చెందిన మాజీ సర్పంచులు, ఎంపీ టీసీలతోపాటు ఆయన వర్గం వారు వెళ్లిన క్రమంలో ఆయన తాజా పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరోమారు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈట ల రాజేందర్ మధ్య ఉన్న విబేధాలు బహిర్గతమయ్యాయి. బీజే పీకి వర్గపోరు కొత్తేమీకాదు.

గతంలో కేంద్ర మంత్రి గా విద్యాసాగర్ రావు ఉన్న సమయంలో, బం డి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సమయంలో గ్రూపు రాజకీయాలు తెరకెక్కాయి. పెద్దల జోక్యంతో సద్దుమణగగా తాజా పరిణామాలతో మరోమారు గ్రూపు రాజకీయా లు తెరమీదకు వచ్చాయి. అయితే ఇరు గ్రూ పులవారు సోషల్ మీడియాను సాధనంగా చేసుకుని పోస్టింగ్ లు చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశమయింది.

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బీసీ నినాదంతో పార్టీ స్థా పించబోతున్నారని, ఆ పార్టీ పేరు బహుజన జనతా సమతి (బీజేఎస్)గా ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈటల వర్గీయులు మాత్రం ఇది మా నాయకుడిని బదనాం చేయడానికి బండి వర్గమే పోస్టింగులు చేస్తుందని అంటున్నాయి.

ఏది ఏమై నా కరీంనగర్ జిల్లాలో నెలకొన్న బీజేపీ వర్గపోరు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసినా ఆ శ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు. రా జకీయ చైతన్యంగల కరీంనగర్ జిల్లా మరో వేదికకు కేంద్రమవుతుందా లేక బీజేపీ కేంద్ర నాయకత్వం బండి, ఈటలను పిలిచి మందలిస్తుందా, బుజ్జగిస్తుందాచూడాలి.