calender_icon.png 21 July, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాయావతి స్ఫూర్తితో మహిళలు శక్తివంతంగా రాజకీయాలు చేయాలి

20-07-2025 10:18:06 PM

చర్ల (విజయక్రాంతి): మండలంలో సత్యనారాయణపురం బహుజన్ సమాజ్ పార్టీ సెక్టార్ సమావేశం పార్టీ చర్ల మండలం కార్యదర్శి సామల ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి బీఎస్పీ పార్టీ భద్రాచలం నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి గుర్రాల దుర్గాభవాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి మహిళల ఓట్లు దండుకొని రాజ్యంలోకి వచ్చిందని ప్రభుత్వం ఏర్పడి ఇంతకాలం అవుతున్న ఇప్పటివరకు ఆ హామీలను నెరవేర్చిన పరిస్థితి లేదని విమర్శించారు. కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని, స్కూటీలు ఇస్తామని ప్రతి మహిళకు రూ 2,500 ఆర్థిక సహకారం అందిస్తామని, పింఛన్లు రూ 4000 పెంచుతామని వికలాంగు పింఛన్లు రూ 6000 లకు పెంచుతామని, రూ 500 లకే గ్యాస్ ఇస్తామని, నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఇలా ఎన్నో హామీలు ఇచ్చి విస్మరించారన్నారు.

మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని రానున్న స్థానిక ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపు నిచ్చారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు తోడు దొంగలన్న నిజాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. బెహన్ జి మాయావతి స్ఫూర్తి తోటి మహిళలు రాజకీయాలలో శక్తివంతంగా పాల్గొనాలని, అన్నింటిలో రాజ్యాధికారంలో సమాన వాటా కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షులు గోగీకార్ రామ్ లక్ష్మణ్ మండల ప్రధాన కార్యదర్శి కొప్పుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.