19-07-2025 11:36:24 PM
పోలీస్ కార్డన్ అండ్ సెర్చ్, 38 వాహనాలు సీజ్...
డీఎస్పీ శ్రీధర్ రెడ్డి..
కోదాడ: యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి(DSP Sridhar Reddy) అన్నారు. శనివారం రాత్రి కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి సార్జింగ్ పేటలో పట్టణ సీఐ శివ శంకర్ అధ్వర్యంలో పోలీసు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో నివాసాలు, వాహనాలు, దుకాణాలు పోలీసులు పరిశీలించారు. సరైన అనుమతి పత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలు 4 ఆటోలను సీజ్ చేశారు. అనంతరం ప్రభుత్వ స్కూల్ లో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం ఏర్పాటు చేసి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. జిల్లా ఎస్పి నరసింహ ఆదేశాల మేరకు కోదాడ డివిజన్ నందు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
యువత ఆదర్శంగా ఉండాలని పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువై నేరాలను అరికట్టడం పోలీసుల ఉద్దేశ్యం అన్నారు. గొడవలు పడి జీవితం జైలు పాలు చేసుకోవద్దన్నారు. యువత గ్రూపులుగా ఏర్పడి వివాదాలు పెట్టుకుని దాడులు చేసుకుని కేసుల్లో చిక్కుకోవద్దని సమస్యలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలి,చట్టానికి లోబడి నడుచుకోవాలని తెలిపారు. ఎస్ఐ లు సుధీర్ కుమార్, హనుమా నాయక్, ఏఎస్ఎలు ఖయ్యూం, సి.ఎస్.రావు, 30 మంది సిబ్బంది తనిఖీల్లో స్థానిక నాయకులు ఖాజా గౌడ్ మదర్ పాల్గొన్నారు.