Districts - Mahabubnagar

పరిగి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతా
పరిగి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతా

గండీడ్: బీజేపీ రాష్ట్ర నాయకుడు వెన్న ఈశ్వరప్ప తన జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పల్లవి గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పరిగి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. 50 మందికి పైగా రక్తదానం చేయడంతో పాటు దేశాయిపల్లి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు. పేదలు, దళితులు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మహమ్మదాబాద్‌కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని గాయత్రికి పుస్తకాలు అందజేశారు.

04-10-2026 | 08:49pm

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి

భూత్పూర్: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం అన్నాసాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు ప్రక్రియ అత్యంత కీలకమని, నెల రోజులపాటు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని బీఆర్‌ఎస్ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. దేవరకద్ర నియోజకవర్గంలో సుమారు 11 వేల మంది పట్టభద్రులు ఉన్నారని, సిట్టింగ్ స్థానాన్ని మరోసారి నిలబెట్టుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

03-10-2026 | 08:36pm