నాచారం రహదారికి రూ.44 కోట్లతో మహర్దశ
ఖమ్మం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఆదివారం రూ. 44 కోట్లతో నిర్మించే నాచారం రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర.టిఎస్, సిపి సునీల్ దత్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
18-10-2026 | 06:50pm