Districts - Narayanpet

భూ భారతి-భూ రి సర్వే కు గ్రామస్తులు సహకరించాలి
భూ భారతి-భూ రి సర్వే కు గ్రామస్తులు సహకరించాలి

మాగనూరు: నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని గజరం దొడ్డి గ్రామంలో భూ భారతి-భూ రీ సర్వే కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక మాట్లాడుతూ, రైతులు భూముల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టిందని తెలిపారు. రైతులు సర్వే అధికారులకు సహకరించి, భూములను సర్వే చేయించుకోవాలని, తద్వారా సరిహద్దు వివాదాలు లేకుండా చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముద్దు రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్ లింగం తదితరులు పాల్గొన్నారు.

30-09-2026 | 03:54pm

గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అధిక ధరలకు మద్యం విక్రయాలు
గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అధిక ధరలకు మద్యం విక్రయాలు

మాగనూరు: నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వెలిశాయని, అధిక ధరలకు విక్రయించబడుతోందని ప్రజలు ఆరోపించారు. మొబైల్ వైన్ షాపులు జీపులలో గ్రామాలు తిరిగి మద్యం సరఫరా చేస్తున్నాయని, జాతీయ రహదారికి ఇరువైపులా డాబాలు, కిరాణా దుకాణాల్లోనూ అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. అధిక ధరలపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేవించి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ప్రయాణికులు భయపడుతున్నారు. ఎక్సైజ్ అధికారులు తక్షణమే స్పందించి దాడులు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

27-09-2026 | 03:01pm