3 September, 2026 | 8:48 PM

Districts - Nizamabad

article_59574672.webp
కెనడా అమ్మాయి.. నిజామాబాద్ అబ్బాయి.. ఒక్కటైన ప్రేమజంట

బోధన్,ఆగస్టు 30 (విజయక్రాంతి): ప్రేమకు ప్రాంతం, భాష, జాతి, కులం, మతం అడ్డంకులు కావని మరోసారి నిరూపించింది ఓ ప్రేమజంట. కెనడాకు చెందిన యువతి, నిజామాబాద్‌కు చెందిన యువకుడు ప్రేమలో పడి ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఖండాంతరాలు దాటిన ఈ ప్రేమకథ ప్రస్తుతం నిజామాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్‌కు చెందిన తాటిపాముల సంజయ్ చదువు, ఉద్యోగం నిమిత్తం కెనడాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలో కెనడాకు చెందిన సబ్రినా ఏమీస్పైన్తో ఆయనకు పరిచయం ఏర్పడింది. తొలుత స్నేహంగా ప్రారంభమైన వీరి పరిచయం క్రమంగా మరింత బలపడింది. ఒకరి అభిప్రాయాలు, ఆలోచనలు, వ్యక్తిత్వాలను మరొకరు అర్థం చేసుకోవడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది.

30-08-2026 | 03:22pm