3 September, 2026 | 8:54 PM

Sports/Eductation -

article_47438316.webp
మెస్సీ శకం ముగిసినట్టేనా..? అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై..!

అర్జెంటీనా: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ(Lionel Messi) అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అర్జెంటీనా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మెస్సీ.. జాతీయ జట్టు కెరీర్‌కు(Lionel Messi retires) ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. అర్జెంటీనా తరఫున 207 మ్యాచ్‌లు ఆడి 125 గోల్స్ చేసిన మెస్సీ.. జట్టు చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నారు. ప్రపంచకప్‌తో పాటు కోపా అమెరికా వంటి ప్రతిష్టాత్మక టైటిళ్లను అర్జెంటీనాకు అందించడంలో మెస్సీ(Lionel Messi retirement) కీలక పాత్ర పోషించారు. మెస్సీ రిటైర్మెంట్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానుల్లో భావోద్వేగం నెలకొంది.

01-09-2026 | 09:30am