Districts - Sangareddy

ఖేడ్ అభివృద్ధి పనులకు రూ.45 కోట్ల నిధులు మంజూరు
ఖేడ్ అభివృద్ధి పనులకు రూ.45 కోట్ల నిధులు మంజూరు

నారాయణఖేడ్: నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. డిగ్రీ కళాశాల వెనుక రూ.5 కోట్లతో ఇండోర్, ఔట్‌డోర్ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, బోరంచలో ఎకో కాటేజీలకు రూ.2 కోట్లు, బోటింగ్‌కు రూ.2 కోట్లు మంజూరయ్యాయని ఆయన వెల్లడించారు. కమలాపూర్ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయడానికి రూ.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల సముదాయానికి రూ.12.5 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.

17-10-2026 | 10:15pm

బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం
బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం

గుమ్మడిదల: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ దశరథ్ కుమార్ తెలిపారు. గుమ్మడిదల, బొంతపల్లి, దోమడుగు, అన్నారం, వీరన్నగూడెం గ్రామాల్లో బతుకమ్మ ఆడే ప్రాంగణాలు, నిమజ్జనం చేసే చెరువు ఘాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మహిళలు, భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ పరిశీలనలో చైర్మన్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

17-10-2026 | 07:55pm