Districts - Yadadri Bhuvanagiri

చరిత్రలోనే అత్యంత అవినీతిమయమైన యూపీఏ కాంగ్రెస్ పాలన..
చరిత్రలోనే అత్యంత అవినీతిమయమైన యూపీఏ కాంగ్రెస్ పాలన..

యాదగిరిగుట్ట: గత కాంగ్రెస్, యూపీఏ పదేళ్ల పాలన దేశ చరిత్రలోనే అత్యంత అవినీతిమయమైనదని, ప్రజలు కాంగ్రెస్ ను నమ్మే స్థితిలో లేరని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రచ్చ శ్రీనివాస్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ అవినీతి లేని పాలన అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రతి రంగంలో లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం జన్ ధన్, ఆధార్, మొబైల్ జేఏఎం త్రయం ద్వారా సంక్షేమ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తున్నాయని తెలిపారు. అవినీతికి తావులేకుండా పాలన సాగుతోందని వెల్లడించారు.

04-10-2026 | 08:21pm