3 September, 2026 | 9:43 PM

Breaking News

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన బిఅర్ఎస్ నాయకులు   •   రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా తమ్మిశెట్టి శ్రీనివాస్‌   •   రైతుల సమస్యలపై కల్లూరులో బీఆర్ఎస్‌ గర్జన   •   డాక్టర్ హరికాంత్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు   •   అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలి: పోచారం శ్రీనివాసరెడ్డి   •   నవిపేట్‌లో బీఆర్ఎస్ రైతు ధర్నా: మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమర్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్   •   కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం   •   మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే   •   దద్దరిల్లిన దిల్ సుఖ్ నగర్   •  

Districts - Wanaparthy

article_74891432.webp
మహబూబ్‌నగర్–డోన్ రైల్వే డబుల్ లైన్‌కు భూసేకరణ త్వరలో పూర్తి

మహబూబ్‌నగర్–డోన్ రైల్వే డబుల్ లైన్‌కు భూసేకరణను వారం, పది రోజుల్లో పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. వనపర్తి జిల్లా పరిధిలోని పారేపల్లి వద్ద 69.09 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు 43.34 ఎకరాల భూమిని సేకరించి అవార్డు పాస్ చేసి రైతులకు పరిహారం అందజేశామని తెలిపారు. మిగిలిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి పది రోజుల్లో పూర్తి చేసి రైల్వే శాఖకు భూమిని అప్పగిస్తామన్నారు.

31-08-2026 | 08:42pm

article_16775695.webp
వెలుగొండకు నికర జలాలు మళ్లిస్తే తెలంగాణకు దుర్దినం

కృష్ణా నది వరద జలాల వినియోగం కోసమే నిర్మించిన వెలుగొండ ప్రాజెక్టుకు నికర జలాలను వినియోగించడాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని, ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం వహిస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా, ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్ర హక్కుల అంశాలను వైట్‌బోర్డుపై చిత్రాలతో సుమారు రెండు గంటల పాటు వివరించారు. వెలుగొండ ప్రాజెక్టుకు కృష్ణా వరద జలాలను మాత్రమే వినియోగించాలన్న నిబంధన ఉందని, అయితే నికర జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

31-08-2026 | 08:27pm