కొల్లాపూర్లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
కొల్లాపూర్, సెప్టెంబర్ 2: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 55వ జన్మదిన వేడుకలను కొల్లాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ బైరపోగు సాంబశివుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పాలాభిషేకం చేశారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి జనసేన పోటీ చేస్తుందని తెలిపారు.
02-09-2026 | 03:10pm