వరంగల్, హనుమకొండకు ఐటీ టవర్లు
వరంగల్: హైదరాబాద్ తరహాలో వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. వరంగల్, హనుమకొండ నగరాలకు ఐటీ టవర్ల ఏర్పాటు ప్రతిపాదనలను పరిశీలిస్తామన్నారు. నాయిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ను ప్రారంభించిన అనంతరం, పద్మాక్షి, భద్రకాళి, వేయిస్తంభాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రకాళి అమ్మవారి రథాన్ని కూడా ప్రారంభించారు. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కృషిని మంత్రి అభినందించారు.
18-10-2026 | 05:30am