4 September, 2026 | 6:59 PM

Crime&legal -

article_79034279.webp
మహిళ అనుమానాస్పద మృతి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యంనంపేట్ లో గుర్తుతెలియని ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానిక శ్రీనిధి యూనివర్సిటీ సమీపంలోని పొదల్లో సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయసు గల మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం తీవ్రంగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో, సుమారు పది రోజుల క్రితమే మహిళ మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు, యూనివర్సిటీ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, క్లూస్ టీమ్ ను రప్పించి ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

04-09-2026 | 06:47pm

article_72696572.webp
బస్సు బోల్తా, డ్రైవర్ దుర్మరణం, ప్రయాణికులకు గాయాలు

కామారెడ్డి, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ చౌరస్తా వద్ద 161జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొని ఆర్టీసీ బస్సు శుక్రవారం బోల్తా పడింది. బస్సు డ్రైవర్ దుర్మరణం చెందగా, బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం బిచ్కుంద ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కామారెడ్డి నుంచి జుక్కల్ కి బయలుదేరి వెళ్లారు. గాయపడిన ప్రయాణికులకు సరైన వైద్యం అందించాలని జిల్లా వైద్యశాఖ అధికారి వెంకట్ కు ఆదేశించారు. బస్సులో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో వివరాలు తెలియాల్సి ఉంది.

04-09-2026 | 01:56pm

article_32932892.webp
బంధువుల ఇంటికి వచ్చి కాల్వలో శవమై తేలిన యువకుడు

ముత్తారం, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కేశనపల్లి గ్రామ సమీపంలోని కెనాల్ కాల్వలో యువకుడి మృతదేహం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మృతుడిని మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బండ సాయిరాం (21)గా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల క్రితం హరిపురంలోని బంధువుల ఇంటికి వచ్చిన సాయిరాం, అక్కడి నుంచి ఖమ్మంపల్లిలోని మరో బంధువుల ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో కేశనపల్లి సమీపంలోని కెనాల్‌లో ప్రమాదవశాత్తు పడిపోయి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం కాల్వలో మృతదేహం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతికి గల పూర్తి కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

04-09-2026 | 01:29pm

article_23594116.webp
గల్లీ "టూ" పల్లె దాకా గుప్పుమంటున్న "గంజాయి" ఘాటు.!

బాన్సువాడ,సెప్టెంబర్ 3(విజయక్రాంతి): పట్టణాలకే పరిమితం అయింది అనుకున్న గంజాయి సమస్య(Marijuana) క్రమ క్రమంగా గ్రామాలు, పల్లెలు, గల్లీలకూ విస్తరిస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మత్తు పదార్థాల ప్రభావం యువతపై పడకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత కుటుంబాలు, విద్యాసంస్థలు, ఎక్సైజ్, పోలీసులు, స్థానిక అధికారులు అందరిపైనా ఉంది. గంజాయి వినియోగం(Cannabis use) ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉండటంతోపాటు, చిన్న వయసులోనే మత్తు పదార్థాల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2018 జాతీయ సర్వేలో 10–17 ఏళ్ల వయసు పిల్లలు, కిశోరుల్లో సుమారు 20 లక్షల మంది ప్రస్తుతం గంజాయి వినియోగిస్తున్నట్లు అంచనా వేశారు.

03-09-2026 | 12:32pm