Districts - Bhadradri Kothagude

ప్రకృతితో మమేకమైన మహోన్నత పండుగ
ప్రకృతితో మమేకమైన మహోన్నత పండుగ

కొత్తగూడెం: బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని, గ్రామీణ శ్రమజీవుల ఐక్యతకు నిదర్శనమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, కొత్తగూడెం పట్టణ పరిధిలోని బస్తీలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు జరుపుకుంటున్న వేడుకలను ఆయన సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్సీబీ నగర్, పాత కొత్తగూడెం, విద్యానగర్, శ్రీనగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన ఘాట్లను సందర్శించి, సామూహిక బతుకమ్మల నిమజ్జనోత్సవాన్ని తిలకించారు. పల్లె పండుగలు మానవ సంబంధాలను బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.

18-10-2026 | 09:50pm

అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎం ఎల్ ఏ మెచ్చా
అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎం ఎల్ ఏ మెచ్చా

దమ్మపేట: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దమ్మపేట మండల కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలను అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు సందర్శించారు. దారా మల్లికార్జున రావు కాంప్లెక్స్, గాంధీ బొమ్మ సెంటర్, బంజారా కాలనీల్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దారా మల్లికార్జున రావు కాంప్లెక్స్ వద్ద అన్నసమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించి, భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. అనంతరం కమిటీ సభ్యులు మెచ్చా నాగేశ్వరరావును సత్కరించారు.

18-10-2026 | 07:03pm