3 September, 2026 | 9:03 PM

Districts - Jangaon

article_68735627.webp
భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. బోనం ఎత్తిన ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి

దేవరుప్పుల, ఆగస్టు 30 ( విజయక్రాంతి): మండల కేంద్రంలోని కొత్తవాడలో బోనాల వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి పాల్గొని బోనం ఎత్తారు.అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దావెర అనిల్ కుమార్, నాయకులు కాసారపు ధర్మారెడ్డి, తోటకూరి పాండు, కృష్ణ, రెడ్డిరాజుల రమేష్, తోటకూరి రమేష్, ఇనుముల నాగరాజు, ఉప్పుల ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

31-08-2026 | 09:29am

article_69768728.webp
నియోజకవర్గ ప్రతీ గ్రామానికి గోదావరి జలాలు తీసుకురావడమే నా ఏకైక ఎజెండా

బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మెడిగడ్డ నుండి 1టీఎంసి ఎత్తిపోయలేదనీ, అయినా వరుసగా 2ఏళ్ళు ధాన్యం దిగుబడిలో దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని, బిఆర్ఎస్ 10ఏళ్ళు అధికారంలో ఉండి తెలంగాణను ఏరకంగా దోచుకున్నారో ప్రజలకు తెలుసని, ధరణిని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ, అసైండ్ భూములను కోళ్లగొట్టారని, దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 6 నెలల్లో పూర్తిచేసి స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి దేవాదుల నీరు అందిస్తామని మాజీ మంత్రి, స్టేషన్ ఘనాపూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి అన్నారు.

29-08-2026 | 07:23pm

article_80021637.webp
కాంగ్రెస్ మోసాలపై వారం రోజులపాటు నిరసనలు

దేవరుప్పుల, ఆగస్టు 29 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 420 మోసపూరిత హామీలను ప్రజల్లో ఎండగట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.శనివారం దేవరుప్పుల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్లో మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ అధ్యక్షత ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీమంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత హామీలపై వారం రోజులపాటు చేపట్టే నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు కార్యకర్త

29-08-2026 | 03:46pm

article_14308590.webp
జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి

తరిగొప్పుల, (విజయక్రాంతి): రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తరిగొప్పుల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో స్థానిక ఎస్సై గుగులోత్ శ్రీదేవి జర్నలిస్టులకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీదేవి మాట్లాడుతూ.. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురావడంలో వారు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. పోలీస్, మీడియా మధ్య స్నేహ సంబంధం, పరస్పర సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల సంక్షేమానికి, భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రింట్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

28-08-2026 | 01:22pm