బంతితో బ్రెయిన్కీ వర్కౌట్
నటి శిల్పా శెట్టి తన తాజా వర్కౌట్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బంతితో పలు వ్యాయామాలు చేస్తూ, ఇవి శరీరం, మెదడుకు ప్రయోజనకరమని తెలిపారు. బంతి వ్యాయామాలు ఏకాగ్రత, శ్రద్ధ, మానసిక స్పష్టతను పెంచి, శరీర సమన్వయాన్ని మెరుగుపరుస్తాయని ఆమె పేర్కొన్నారు. మెదడు, శరీరం కలిసి పనిచేసేలా చేసే కదలికలు జ్ఞాపకశక్తి, మోటార్ నియంత్రణ, సమన్వయానికి దోహదపడతాయని వివరించారు. ప్రతి సోమవారం ఫిట్నెస్ ప్రేరణను పంచుకునే శిల్పా, ఫాలోవర్లను చురుకైన, ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రోత్సహిస్తున్నారు.
05-10-2026 | 12:38pm