డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
సూర్యాపేట: జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. పులిచింతల ప్రాజెక్టు, గడ్డిపల్లి పాఠశాల, సయ్యద్ ముజావర్ పేట ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్, భద్రత, ప్రోటోకాల్, ప్రాథమిక సౌకర్యాలపై దిశానిర్దేశం చేశారు. రూ. 200 కోట్లతో గడ్డిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, మునగాలలో రూ.9.60 కోట్లతో కమ్యూనిటీ కిచెన్‌కు భూమిపూజ చేయనున్నట్లు తెలిసింది.
06-10-2026 | 12:21am