దద్దరిల్లిన దిల్ సుఖ్ నగర్
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం దిల్ సుఖ్ నగర్ లో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... రాష్ట్రంలోని 14 లక్షల మంది కళాశాల విద్యార్థులకు సంబంధించిన రూ, 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
03-09-2026 | 08:42pm