3 September, 2026 | 10:35 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే నా లక్ష్యం   •   క్రాంతి విద్యాలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు   •   అతివలకు అండగా షీ టీం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన బిఅర్ఎస్ నాయకులు   •   రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా తమ్మిశెట్టి శ్రీనివాస్‌   •   రైతుల సమస్యలపై కల్లూరులో బీఆర్ఎస్‌ గర్జన   •   డాక్టర్ హరికాంత్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు   •   అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలి: పోచారం శ్రీనివాసరెడ్డి   •   నవిపేట్‌లో బీఆర్ఎస్ రైతు ధర్నా: మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమర్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్   •  

Districts - Jayashankar Bhupalapally

article_24925123.webp
పుష్కరాల నాటికి ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేయాలి

భూపాలపల్లి/కాళేశ్వరం, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అభివృద్ధి పనులను పరిశీలించి నాణ్యతలో రాజీ లేకుండా, శాఖల సమన్వయంతో పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, అర్చకులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

02-09-2026 | 07:20pm

article_71025793.webp
పోచమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పణ

గణపురం సెప్టెంబర్ 02 (విజయ క్రాంతి): శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా గణపురం మండల కేంద్రంలో గ్రామస్థులు పోచమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బుధవారం బోనాలను సమర్పించారు. మొదట భక్తులు గ్రామ దేవతల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాలను నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకొని ప్రదక్షిణల అనంతరం నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా కుటుంబాలు చల్లగా ఉండాలని పాడిపంటల సమృద్ధిగా పండాలని పోచమ్మ తల్లిని భక్తులు వేడుకున్నారు.

02-09-2026 | 04:05pm