కులం పేరుతో దాడి: కఠిన చర్యలు తీసుకోవాలి
నాగిరెడ్డిపేట్: మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన బంధముల నరేష్పై దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుంటోళ్ళ యాదయ్య, ఎంఆర్పిఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని, దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవాలని కోరారు. నరేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందని, అవసరమైతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
18-10-2026 | 04:27pm