Districts - Nirmal

మాజీ గవర్నర్ ను కలిసిన ట్రస్ట్ సభ్యులు
మాజీ గవర్నర్ ను కలిసిన ట్రస్ట్ సభ్యులు

నిర్మల్: అఖిలభారత అయ్యప్ప సేవా ట్రస్ట్ సభ్యులు మిస్సోరం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన, శబరిమల మేల్ శాంతి గోశాల విష్ణు వాసుదేవన్ నంబూత్రిలను మర్యాదపూర్వకంగా కలిశారు. నవంబర్ నెలలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. శబరిమలకు సమీపంలోని నారాయణ తోడ గ్రామంలో ప్రతినెల ఆలయం తెరిచిన సమయంలో అన్న సంతర్పణ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా వేములవాడ, కొండగట్టు, తుల్లపల్లి గ్రామాల్లో ట్రస్ట్ నిర్వహించిన సేవా కార్యక్రమాలను వివరించగా, వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

05-10-2026 | 07:59pm

ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ
ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

నిర్మల్ జిల్లాలోని బాసర బైంసా పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డైరెక్టర్ ప్రజారోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ, హైదరాబాద్ డాక్టర్ రవీంద్ర నాయక్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, ఔషధాల లభ్యత, రోగుల నమోదు, సిబ్బంది హాజరు, ల్యాబొరేటరీ పరీక్షలు, మాతా శిశు ఆరోగ్య సేవలు, టీకా కార్యక్రమాలు, కుటుంబ నియంత్రణ, ఎన్‌సీడీ స్క్రీనింగ్ వంటి అంశాలను పరిశీలించారు. ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

03-10-2026 | 07:31pm