సంబరంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
వెల్దుర్తి: తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుపుకునే బతుకమ్మ సంబరాలను వెల్దుర్తి మండలంలోని నెల్లూరు, లింగాపూర్, రామయపల్లి, శెట్టిపల్లి, ఎలుకపల్లి, ఏదులపల్లి గ్రామాల్లో మహిళలు విజయవంతం చేశారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో మహిళలు ఆటపాటలతో పాల్గొని, పూజలు నిర్వహించి, బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్లను మహిళలు అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
18-10-2026 | 09:48pm