Districts - Mancherial

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు

లక్షేట్టిపేట: ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు అందించే వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలు, రోగుల సంఖ్య, మందుల లభ్యత, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. దగ్గు, జలుబు, జ్వరాలతో పాటు డెంగ్యూ లక్షణాలతో వస్తున్న రోగుల వివరాలపై సమీక్షించారు. డెంగ్యూ కేసులు నమోదవుతున్న ప్రాంతాలలో త్రాగునీటి నాణ్యతను పరీక్షించాలని, మురుగు కాలువలను శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

17-10-2026 | 07:01pm