బిఆర్ టి యు ఆధ్వర్యంలో ధర్నా
కరీంనగర్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికులు బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్లకు రూ.18 వేల వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏఎన్సీ టార్గెట్లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల వేతనం ఇస్తామన్న హామీని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, ఎండీ రబియాబేగం, బుర్ర మంజుల తదితరులు పాల్గొన్నారు.
02-09-2026 | 07:13pm