జిల్లాలకు హెచ్చరిక
హైదరాబాద్: ఏపీ, తెలంగాణలో వర్షాల ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలోనూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
24-09-2026 | 09:41am