05-12-2024
ముంబై, డిసెంబర్ 4: ఒకవైపు ద్రవ్యోల్బణం పెరగడం, మరోవైపు జీడీపీ వృద్ధి రెండేండ్ల కనిష్ఠస్థాయికి తగ్గిన నేపథ్యంలో రిజర్వ్‌బ్యాంక్ పాలసీపై భిన్న అంచనాల నడుమ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభమయ్యింది.
05-12-2024
ముంబై, డిసెంబర్ 4: రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు అండతో వరుసగా నాలుగో రోజూ బీఎస్ఈ సెన్సెక్స్ పెరిగింది. అయితే దక్షిణ కొరియాలో మార్షల్ లా విధింపు, తొలగింపు, యూ ఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ ప్రసంగించనున్న కారణంగా ప్రపంచ మార్కెట్లు ఊగిలాడటంతో బుధవారం స్టాక్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి.
05-12-2024
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: వొడాఫోన్ ఐడియాలో భాగస్వామి అయిన బ్రిటన్ టెలికాం సంస్థ వొడాఫోన్ ఇండస్ టవర్స్‌లో 3 శాతం వాటాను రూ.2,841 కోట్లకు విక్రయించడానికి సిద్ధమయ్యింది. తమ ఇండియా వెంచర్ వొడాఫోన్ ఐడియాకు సంబంధించిన బకాయిలు రూ.856 కోట్లు చెల్లించేందుకు, ఇతర రుణాల చెల్లింపునకు వాటా విక్రయిస్తున్నట్లు ఎక్సేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
04-12-2024
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: భారత్ మొత్తం విదేశీ రుణం 2023 సంవత్సరం చివరినాటికి 31 బిలియన్ డాలర్ల మేర పెరిగి 647 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.54.83 లక్షల కోట్లు) చేరినట్లు ప్రపంచ బ్యాంక్ తాజా రిపోర్ట్ వెల్లడించింది. ఈ రుణాలకు భారత్ వడ్డీ చెల్లింపులు 22.54 బిలియన్ డాలర్లకు పెరిగాయన్నది.
05-12-2024
ముంబై, డిసెంబర్ 4: క్రితం రోజు కొంతకోలుకున్న రూపాయి బుధవారం తిరిగి కొత్త కనిష్ఠస్థాయికి పతనమయ్యింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో (ఫారెక్స్)డాలరు మారకంలో రూపాయి విలువ 7 పైసలు నష్టపోయి రికార్డు కనిష్ఠస్థాయి 84.75 వద్ద ముగిసింది.
05-12-2024
ముంబై, డిసెంబర్ 4: మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపు విధానాన్ని ప్రోత్సహించేదిశగా యూపీఐ లైట్ వ్యాలెట్‌లో ఒక్కో లావాదేవీ పరిమితిని రూ.500 నుంచి రూ.1,000కు, ఏ సమయంలోనైనా మొత్తం జరిపే చెల్లింపుల పరిమితిని రూ.2,000 నుంచి రూ.5,000కు పెంచుతున్నట్లు బుధవారం రిజర్వ్‌బ్యాంక్ ప్రకటించింది.