3 September, 2026 | 9:06 PM

Districts - Adilabad

article_12438695.webp
పంట నష్టపరిహారం ఇవ్వకుంటే న్యాయ పోరాటం

ఆదిలాబాద్, సెప్టెంబర్ 03, (విజయక్రాంతి) : గత ఏడాది భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మొత్తం నష్ట పరిహారాన్ని ఫ్రీజింగ్ ఎత్తివేసి రైతులకు అందించాలని జడ్పీ మాజీ చైర్పర్సన్, బీజేపీ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... గత సంవత్సరం ఆగస్టులో సంభవించిన వర్షాల కారణంగా సుమారు 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగుండన్నారు. ఆ సందర్భంలో అప్పటి ఇన్చార్జి మంత్రి ముంపు ప్రాంతాలను పరిశీలించి, పది రోజుల్లోగా నష్టపోయిన రైతులకు 10 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించినప్పటికీ అది ఇంతవరకు అమలకు నోచుకోలేదని ఆమె ఆక్షేపించారు.

03-09-2026 | 03:15pm

article_27244298.webp
గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

బోథ్. సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): సోనాల మండలంలోని గొల్లపూర్ గ్రామానికి చెందిన ఆత్రం లచ్చు అనే వ్యక్తి తన పంట చేనులో గంజాయి సాగు చేస్తుండడంతో ఆయన చేనులో ఐదు గంజాయి మొక్కలు ఎస్సై వి పురుషోత్తంస్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రీమాండు కు తరలించడం జరిగిందని. సిఐ గురుస్వామి తెలిపారు. పత్తి పంటలో అంతర పంటగా గంజాయిని పండిస్తున్నట్లు గుర్తించి మొక్కలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. స్వాధీనం చేసుకున్న మొక్కలు గంజాయి మొక్కలే అని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించి నట్లు సీఐ తెలిపారు. పట్టుకున్న 50 వేల రూపాయలు విలువ ఉందన్నారు.

02-09-2026 | 08:30pm

article_83806775.webp
గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి

గణపతి నవరాత్రి ఉత్సవాలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, గణేష్ మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. పట్టణంలోని తానిషా గార్డెన్ లో మంగళ వారం గణపతి మండప నిర్వహ కమిటీ సభ్యులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, కౌన్సిలర్లు, నాయకులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా గణపతి నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉందని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుతూ, దానిని భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలన్నారు.

01-09-2026 | 11:59pm