కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కష్టాలే
దామరచర్ల: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు నీరు, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, గతంలో కేసీఆర్ చెప్పిన మాటలు నిజమయ్యాయని జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఎండి యూసుఫ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నీరు, విద్యుత్ అందించడంలో విఫలమైందని ఆరోపించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు నాణ్యమైన బొగ్గు సరఫరా చేయలేకపోవడం, రైతు బీమా ఇవ్వకపోవడంపై విమర్శలు గుప్పించారు. రానున్న రోజుల్లో మంత్రులను, ఎమ్మెల్యేలను రోడ్లమీద తిరగనివ్వమని హెచ్చరించారు.
16-10-2026 | 07:42pm