3 September, 2026 | 9:05 PM

Districts - Ranga Reddy

article_56711436.webp
హఫీజ్‌పేట్‌లో కూల్చివేతలు..సుభాష్ నగర్‌లో ఉద్రిక్తత

మాదాపూర్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): మాదాపూర్ సర్కిల్-50 పరిధిలోని న్యూ హఫీజ్‌పేట్ సుభాష్ చంద్రబోస్ నగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ అధికారులు యంత్రాలతో కూల్చివేతలు ప్రారంభించగా స్థానికులు ఆందోళనకు దిగారు. ఇళ్లను కూల్చవద్దని బాధితులు అధికారులను వేడుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా మియాపూర్ పోలీసులు భారీగా మోహరించారు. సర్వే నంబర్ 80 చుట్టూ దశాబ్దాలుగా భూ వివాదాలు కొనసాగుతున్నట్లు స్థానికులు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు పేర్కొన్నారు.

02-09-2026 | 05:42pm