రామాపురం ఎంసీహెచ్‌ని పరిశీలించిన కలెక్టర్

23-10-2026 | 12:07pm

కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలోని రామాపురం మాతా శిశు వైద్య కేంద్రాన్ని(Ramapuram Maternal and Child Health Centre) శుక్రవారం జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్(Collector Hemant Keshav Patil) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య కేంద్రంలో కొనసాగుతున్న వైద్య సేవలు, గర్భిణులు, బాలింతలు, శిశువులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, చికిత్సా విధానాలపై సంబంధిత వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వైద్య కేంద్రానికి వచ్చే రోగులకు అందిస్తున్న సేవల నాణ్యత, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండే సమయాలు, మందుల నిల్వలు, వైద్య పరికరాల వినియోగం, ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందుతున్నాయా అనే విషయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హేమంత్ కేశవ్ పటేల్  మాట్లాడుతూ.

మాతా శిశు ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన వైద్య సేవల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా చూడాలని, వైద్య కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్కరికీ అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

వైద్య కేంద్రంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, సిబ్బంది పనితీరు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలపై సమీక్షించిన కలెక్టర్, మాతా శిశు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వైద్య సేవలను సమర్థవంతంగా అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆసుపత్రి రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ యాదగిరి. డాక్టర్ జై వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు