4 September, 2026 | 10:22 PM

News -

article_71198441.webp
కొండా సురేఖ కాంగ్రెస్‌లో కొనసాగితే అవకాశం ఇస్తాం: మహేష్ కుమార్

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): కొండా సురేఖ పార్టీలో కొనసాగితే తప్పకుండా అవకాశం కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి నాయకుడైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిన్న సురేఖ ఆవేశం, ఆవేదనతో మాట్లాడారని, ఇకపై బహిరంగంగా ఇష్టారాజ్యంగా మాట్లాడకూడదని సూచించారు. గతంలో ఆమెకు రెండుసార్లు అవకాశం ఇచ్చామని, క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా ఏఐసీసీ చర్యలు తీసుకుందని తెలిపారు. పార్టీలో ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఉన్నప్పటికీ క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉంటామని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు.

04-09-2026 | 04:59pm