ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్

23-10-2026 | 11:49am

కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామం(Jatprolu village)లో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల(Integrated residential school)ను శుక్రవారం క్షేత్రస్థాయిలో సందర్శించి, నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్మాణ ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్(Collector Hemant Keshav Patil) పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణ పనులు, ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

నిర్మాణ పనులు వివిధ దశల్లో సాధించిన పురోగతిని సమీక్షించి, ప్రస్తుత స్థితిగతులపై సమగ్ర సమాచారాన్ని సేకరించారు. పాఠశాల నిర్మాణానికి సంబంధించి పూర్తయిన పనులు, పురోగతిలో ఉన్న పనులు, మిగిలి ఉన్న నిర్మాణ పనుల వివరాలను అధికారులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు. క్షేత్రస్థాయిలో నిర్మాణ పనుల పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్, పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... నిర్మాణ పనులను వేగవంతం చేసి, మిగిలి ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

నిర్మాణ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, పనుల నిర్వహణలో సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ జటప్రోలు గ్రామంలోని శ్రీ మదన గోపాలస్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను సమర్పించారు. అనంతరం ఆలయ విశిష్టతను వివరించారు. జిల్లా కలెక్టర్ ఆలయ ప్రాంగణంలోని శిల్పకళా విశేషాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోవింద గౌడ్. సర్పంచు పద్మ కృష్ణయ్య.  అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు