తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలలు రగిలించిన రోజే దీక్ష దివస్

29-11-2026 | 11:47pm

మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్.                         

నల్లగొండ, నవంబర్ 29 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్(Initiation Day) అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ర‌వీంద్ర కుమార్(Former Devarakonda MLA Ravindra Kumar) అన్నారు. ఆదివారం జిల్లాలోని దేవ‌ర‌కొండ‌లో బీఆర్ఎస్(BRS) చేప‌ట్టిన‌ దీక్షా దివస్ కార్య‌క్ర‌మానికి హాజ‌రై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై కేంద్ర ప్రభుత్వం నాన్చుడి ధోరణి అవలంబించడంతో ఆవేదన చెందిన కేసీఆర్(KCR) తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అన్న నినాదంతో 2009 నవంబర్ 26న ఆమరణ నిరాహార దీక్ష దిగార‌న్నారు.

కెసిఆర్ ను ఆమరణ దీక్ష చేయకుండా మార్గమధ్యంలో అడ్డుకొని ఖమ్మం జైలుకు తరలించార‌ని గుర్తు చేశారు. కెసిఆర్ ఖమ్మం జైల్లో అన్నపానీయాలు ముట్టకుండా ఆమరణ దీక్షకు దిగడంతో తెలంగాణ సమాజంలో ఉద్యమ జ్వాలా రగిలింది. పల్లె పల్లెనా ప్రజలు ముందుకొచ్చి జై తెలంగాణ నినాదం పెట్టుకోవడంతో కేంద్రం దిగివచ్చి 2009 డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించింద‌న్నారు. కార్య‌క్ర‌మంలో నాయకులు కేతావత్ భీల్యా నాయక్ , నేనావత్ కిషన్ నాయక్ , రమేష్ నాయక్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు