పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి

16-10-2026 | 10:18pm

మాగనూరు, అక్టోబర్ 16 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Graduate MLC Election) ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా ఓటరుగా(Voter) నమోదు చేసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు జయానందరెడ్డి(Jayananda Reddy) కోరారు. శుక్రవారం మాగనూరు మండలం వర్కూరు గ్రామంలో బీజేపీ మండల శాఖ(BJP Mandal Branch) ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జయానందరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తమ ఓటును బీజేపీ బలపరిచిన అభ్యర్థికి వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు మల్లేష్, మండల ప్రధాన కార్యదర్శి తిమ్మప్ప, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, నాయకులు మురళీధర్ గౌడ్, ప్రతాపరెడ్డి, కేశవరెడ్డి, డి. శ్రీనివాసులు, వెంకటప్ప, సుమంత్, శరత్, నరేష్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు