BLOలకు అందని సర్ పారితోషికం

13-10-2026 | 05:09pm

నారాయణపేట జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో చెల్లింపులు.. మద్దూరులో మాత్రం ఎదురుచూపులు

మద్దూరు: సర్ విధులు నిర్వహించిన బూత్ లెవల్ అధికారుల(Booth Level Officers)కు పారితోషికం అందకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. నారాయణపేట జిల్లాలోని మక్తల్ నారాయణపేట నియోజకవర్గాలలో BLOలకు రూ.14 వేల నుంచి రూ.16 వేల పారితోషికం అందినప్పటికీ, మద్దూరులో మాత్రం ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని అంగన్వాడీలు పేర్కొంటున్నారు.

ఈ విషయమై అధికారులను అడిగితే పారితోషికం చెల్లిస్తామని దాటవేస్తున్నారు , అయితే ఇప్పటివరకు తమ ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించి తమకు రావాల్సిన పారితోషికాన్ని వెంటనే చెల్లించాలని కోరుతూ మద్దూరు తహసీల్దార్‌ కు వినతిపత్రం అందజేశారు. సంబంధిత అధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న SIR పారితోషికాన్ని త్వరితగతిన విడుదల చేయాలని MROకి తెలంగాణ అంగన్వాడీ యూనియన్ సిఐటియు మద్దూరు వారు వినతిపత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు