ఇంటి నిర్మాణానికి ఆటంకం

17-10-2026 | 05:22pm

 పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు

మాగనూరు ,అక్టోబర్ 17: మాగనూరు మండల(Maganur Mandal) కేంద్రంలోని మంగలి అశోక్ ఇంటి నిర్మాణ పనులను అడ్డుకున్న మాగనూరు పంచాయతీ కార్యదర్శి తిమ్మ ప్పను సస్పెండ్ చేయాలని శనివారం సిపిఎం నాయకులు(CPM leaders) ఎంపీడీవో శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు పి ఆంజనేయులు మాట్లాడుతూ సర్వేనెంబర్ 8లో ఇంటి నిర్మాణం కోసం అన్ని అనుమతులు పొంది పనులు ప్రారంభిస్తే పంచాయతీ కార్యదర్శి ఇంటి నిర్మాణం అడ్డుకోవడం నిర్మిస్తున్న గోడను ఎక్స్ లెటర్ తో కూల్చివేయడం ధారణమని వారు మండి పడ్డారు. గోడ కూల్చిన ఇంటి యజమానికి ఆర్థిక నష్ట కలిగించిన  పంచాయతీ కార్యదర్శి ఆర్థిక నష్టం ఇవ్వాలని ఎంపీడీవో కు ఫిర్యాదు చేశా మన్నారు.పరిహారం చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకుంటామని వారు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు