పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు చేసుకోండి

16-10-2026 | 07:44pm

మాగనూరు. అక్టోబర్ 16. బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యక్రమని మండల బిజెపి అధ్యక్షులు జయానందరెడ్డి(BJP President Jayananda Reddy) ప్రారంభించారు. శుక్రవారం మండల పరిధిలోని వర్కూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రులు తప్పకుండా ఓటరు నమోదు చేసుకొని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ భృతి,, ఉపాధి కల్పన వంటి హామీలు తుంగలో తొక్కి విస్మరించిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని వారన్నారు.

రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తమ ఓటును బిజెపి పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థికి తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ మల్లేష్ మండల ప్రధాన కార్యదర్శి తిమ్మప్ప , కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు నరసింహారెడ్డి ,సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్ ,ప్రతాపరెడ్డి ,కేశవరెడ్డి ,డి శ్రీనివాసులు ,వెంకటప్ప ,సుమంత్ ,శరత్, నరేష్ ,అభిషేక్ , బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు