18 August, 2026 | 8:21 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్

18-08-2026 07:47 PM

మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి

ఘట్ కేసర్,(విజయక్రాంతి): సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి అన్నారు. ఘట్ కేసర్ గౌడ సంఘం అధ్యక్షులు మదనగిరి సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని ఘట్ కేసర్ పట్టణ కేంద్రం బైపాస్ రోడ్డు చౌరస్తాలో ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనియాడారు. పేదల కోసం ఆయన చేసిన త్యాగాలు, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమం నేటి తరానికి ఆదర్శమన్నారు. పాపన్న గౌడ్ జయంతిని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని పలువురు నాయకులు పేర్కొన్నారు.