18 July, 2026 | 12:48 AM

యశోద హాస్పిటల్‌కు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

18-07-2026 12:48 AM

ఐబీడీ అవగాహన కార్యక్రమానికి గాను అవార్డు

హైదరాబాద్, జులై 17 (విజయక్రాంతి): నగరంలోని సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (ఐబీడీ)పై నిర్వహించిన అతిపెద్ద అవగాహన కార్యక్రమంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టీఎంలో స్థానం సంపాదించింది. ప్రత్యక్షంగా, ఆన్‌లైన్ ద్వారా మొత్తం 578 మంది ఒకేసారి పాల్గొని ఈ చారిత్రాత్మక ఘనతను సాధించారు. ప్రజల్లో ఐబీడీపై అవగాహన పెంపొందించడం, వ్యాధిని ముందుగానే గుర్తించేలా చేయడం యశోద హాస్పిటల్స్ -సోమాజి గూడ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

గిన్నిస్ వరల్ రికార్డ్స్ అధికారిక అడ్జుడికేటర్ రిషినాథ్ సమక్షంలో ఈ రికార్డును ధృవీకరించగా, డాక్టర్ కిరణ్ పెద్ది, సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ డైరెక్టర్, సెంటర్ ఫర్ ఐబీడీ, డాక్టర్ ఎస్ ప్రశాంత్ రెడ్డి, యూనిట్ హెడ్, సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ ఈ అవార్డును స్వీకరించారు. ఈ చారిత్రాత్మక విజయానంతరం ‘ఐబీడీ కాంక్లావ్ 2.0 అంతర్జా తీయ శాస్త్రీయ సదస్సును యశోద హాస్పిటల్స్- విజయవంతంగా నిర్వహించింది. దేశ విదేశాల నుంచి 300 మందికి పైగా ప్రతినిధులు, ముగ్గురు అంతర్జాతీయ అధ్యాపకులు, 50 మందికి పైగా జాతీయ నిపుణు లు పాల్గొని ఐబీడీ చికిత్సలో అందుబాటులోకి వచ్చిన అంశాలపై చర్చించారు.