కేంద్ర ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి
వికారాబాద్, అక్టోబర్- 23 : కేంద్ర ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ కుమార్(Election Commissioner of India Gyanesh Kumar) రాజీనామా చేయాలని సిపిఎం నాయకుడు ఆర్.మహిపాల్(CPM leader R. Mahipal) డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ... కేంద్ర ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా(Vikarabad District) కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహిపాల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం వెంకటయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ పాషా కెవిపిఎస్ నాయకులు మాట్లాడుతూ గత నెల రోజులుగా కేంద్ర ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని, దేశంలో 13 కోట్ల తొలగించిన ఓట్లను, రాష్ట్రంలో తొలగించిన 73లక్షల ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని, ఎస్ ఐ ఆర్ ను పూర్తిగా రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల కమిషన్ తొలగించాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన పోరాటంలో పాల్గొన్న యువతి యువకులపై విద్యార్థులపై నాయకుల పై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించలని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు దేశంలో ఉన్న లౌకిక ప్రజాస్వామ్య వాదులు కార్మికులు రైతులు విద్యార్థులు నిరుద్యోగులు, ఎస్ఆర్ కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో పాల్గొనలని అన్నారు. ఎస్ ఐ ఆర్ ను పూర్తిగా రద్దు చేసేవరకు, జ్ఞానేష్ కుమార్ తొలగించే వరకు జరుగుతున్న పోరాటాలకు కలసి రావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసా కార్మిక సంఘం అధ్యక్షుడు బుగ్గప, citu జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, చంద్రయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ రెడ్డి, సుదర్శను జగన్ నర్సింలు అనంతయ్య రవి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీను నాయక్ , ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు తేజ బాయ్ , లక్ష్మీయా సత్యయ్యా రఘురాం సత్తయ్య పెంటయ్య నర్సింలు మల్లేష్ రమేష్ యాదయ్య దశరథ్ చందు నాయకులు తదితరులు పాల్గొన్నారు