కేటీఆర్ ను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన చైతన్య కిరణ్
23-10-2026 | 07:25pm
వికారాబాద్, అక్టోబర్- 23 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(Kalvakuntla Taraka Rama Rao) (కేటీఆర్)ను మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండుగ(Dasara Festival) శుభాకాంక్షలు తెలిపిన యువ నాయకుడు చైతన్య కిరణ్ మల్కాపురం(Kiran Malkapuram). ఈ సందర్భంగా కేటీఆర్ కు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రజలందరికీ విజయదశమి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు అందించాలని ఆకాంక్షించారు.
ప్రజల సంక్షేమం, యువత అభ్యున్నతి, తెలంగాణ అభివృద్ధి కోసం కేటీఆర్ చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని చైతన్య కిరణ్ పేర్కొన్నారు.