రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

23-10-2026 | 11:58am

​నర్సాపూర్: ​ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన నర్సాపూర్(Narsapur) మండల పరిధిలో చోటుచేసుకుంది. ​పోలీసుల వివరాల ప్రకారం... నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన ఏంబరి నరేష్ (21) కార్ డ్రైవర్ గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా స్నేహితులను కలిసేందుకు ఈ నెల 20న రాత్రి బైక్‌పై ఇంటి నుంచి బయలుదేరాడు. రాత్రయినా అతను తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు.

​గురువారం ఉదయం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని రోడ్డు పక్కన ఉన్న పొలంలో నరేష్ మృతదేహంతో పాటు అతని బైక్ ఉన్నట్లు గ్రామస్తులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ద్విచక్రవాహనం స్కిడ్ అయి కిందపడటంతో తీవ్ర గాయాలై నరేష్ మృతిచెందాడని, ఈ ఘటనపై ఎవరిపైనా అనుమానం లేదని తండ్రి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు