టీడబ్ల్యూ యూనియన్‌కు ఎమ్మెల్యే మద్దతు
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావును ఆర్టీసీ టీడబ్ల్యూ యూనియన్ (TWU Union) నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ ఎన్నికల (RTC Elections) నేపథ్యంలో యూనియన్‌కు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చినట్లు టీడబ్ల్యూ యూనియన్ నాయకులు తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంక్షేమం (Employee Welfare) కోసం యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే మద్దతు తమకు మరింత బలాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్టీసీ డిపో టీడబ్ల్యూ చైర్మన్ పోతారుల రవీందర్, అధ్యక్షులు మచ్చిక అక్షయ్ కుమార్, కార్యదర్శి బండి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు విడిదినేని శంకర్, దుగ్యాల లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.