తెలంగాణ ముద్దుబిడ్డ చికిత: సీఎం అభినందనలు!
హైదరాబాద్: జపాన్‌లో జరుగుతున్న Asian Games 2026లో తెలంగాణకు చెందిన ఆర్చరీ క్రీడాకారిణి చికిత తానిపర్తి(Chikitha Taniparthi Gold) అద్భుత ప్రదర్శనతో మెరిసింది. కాంపౌండ్ ఆర్చరీలో స్వర్ణ పతకాలు సాధించడంతో పాటు 2028 Los Angeles Olympicsకు అర్హత సాధించిన చికితకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(Chikitha Revanth Reddy) అభినందనలు తెలిపారు. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సాహిల్ జాదవ్‌తో కలిసి సాధించిన విజయం దేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
ఆసియా క్రీడల్లో ఒకేరోజు రెండు Gold Medals సాధించడం ద్వారా చికిత తెలంగాణ క్రీడారంగానికి గర్వకారణంగా నిలిచిందని సీఎం కొనియాడారు. ముఖ్యంగా కాంపౌండ్ ఉమెన్స్ టీమ్‌తో పాటు Compound Mixed Team విభాగంలోనూ స్వర్ణం సాధించడం ఆమె ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు. మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్ జోడీ దక్షిణ కొరియాను ఓడించి Archery Gold సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్‌కు 2028 Olympics Olympic Quota కూడా దక్కింది. ఒలింపిక్స్‌లో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ తొలిసారి చోటు దక్కించుకోనున్న నేపథ్యంలో.. ఆ విభాగానికి భారత్ తొలి అర్హత సాధించిన దేశంగా నిలిచింది.
పెద్దపల్లికి చెందిన చికిత( Peddapalli Chikitha) చిన్న వయసు నుంచే ఆర్చరీలో ప్రతిభను ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది. ఆమె సామర్థ్యాన్ని గుర్తించి నిరంతరం ప్రోత్సహించిన తల్లిదండ్రులు, శిక్షణ అందించిన కోచ్‌లను కూడా సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. వారి సహకారం చికిత విజయ ప్రస్థానంలో కీలకమని పేర్కొన్నారు. నిరంతర సాధన, పట్టుదల, దృఢ సంకల్పంతో చికిత సాధించిన ఈ విజయం తెలంగాణలోని(Telangana Sports) యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని సీఎం అన్నారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ పేరు మార్మోగేలా చేసిన చికిత తానిపర్తికి భవిష్యత్తులో మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షించారు.