రేపు బాన్సువాడకు మంత్రి సీతక్క రాక

26-10-2026 | 01:07pm

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క మంగళవారం బాన్సువాడకు రానున్నట్లు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే(MLA) పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) తెలిపారు.మంత్రి సీతక్క(Minister Sitakka) పర్యటనకు సంబంధించి బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతో సోమవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో సమావేశమై ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి,

కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర మాజీ ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. మంగళవారం మధ్యాహ్నం మధ్యాహ్నం 2 గంటలకు కొయ్యగుట్ట తాండలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి భూమిపూజ.మధ్యాహ్నం 3 గంటలకు బాన్సువాడ పట్టణంలోని 3వ వార్డులో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనం ప్రారంభోత్సవం.మధ్యాహ్నం 3:30 గంటలకు బోర్లం గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం.ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను ప్రజా ప్రతినిధులు, నాయకులు సమన్వయంతో చేపట్టి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పోచారం సూచించారు.

మరిన్ని వార్తలు