వినాయకుడిని దర్శించుకున్న ఆర్టీఐ యాక్టివిస్ట్ సొసైటీ నాయకులు

18-09-2026 | 04:57pm

సత్తుపల్లి: సెప్టెంబర్ 18. ( విజయ క్రాంతి): ఎన్టీఆర్ నగర్ సమాచార హక్కు చట్టం–2005 (Right to Information Act) యాక్టివిస్ట్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోత్ నందు నాయక్ (Banoth Nandu Naik) ఆహ్వానం మేరకు సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్‌లోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని ఆర్టీఐ యాక్టివిస్ట్ సొసైటీ (RTI Activist Society) వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భావుసింగ్ నాయక్ దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయకుడి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో సొసైటీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ లటికే లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

మరిన్ని వార్తలు