కనుగుట్టలో కొనసాగుతున్న డిజిటల్ సర్వే..
18-09-2026 | 05:29pm
బోథ్ సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మండలంలోని కనుగుట్ట గ్రామంలో డిజిటల్ సర్వే కొనసాగుతున్నది. వాలంటీర్ కైపెల్లి రాజు(Volunteer Kaipelli Raju) మాట్లాడుతూ ప్రతి రైతు పండించిన పంటను విక్రయానికి డిజిటల్ సర్వే తప్పనిసరి అని సూచించారు. రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పంట విక్రయానికి ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు.